చింత చచ్చినా...పులుపు చావలేదు...అనే విధంగా అధికారం కోల్పోయినా హడావిడి తగ్గలేదు టీడీపీ నాయకుల్లో, కార్యకర్తల్లో. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఉంటే ఏదైనా సాధ్యం అనే విధంగా తెలుగు తమ్ముళ్ళు డప్పుకొట్టేవాళ్లు. అబ్బో బాబు ఉంటే చాలు పెద్ద పెద్ద తుపాన్లని సైతం ఆపేస్తారు...మండుటెండలని సైతం రాకుండా చేస్తారు అనే విధంగా మాట్లాడేవాళ్లు.