రెండున్నర ఏళ్లలో పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టి, వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తాను....ఇది జగన్ అధికారంలోకి వచ్చాక, కొత్తగా మంత్రివర్గం ఏర్పాటు చేసుకునే రోజు చెప్పిన మాట. ఒకేసారి 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి పాలన మొదలుపెట్టిన జగన్, అప్పుడు ఛాన్స్ దక్కని వారికి రెండున్నర ఏళ్లలో మళ్ళీ మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తానని చెప్పారు.