అనారోగ్యంతో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎమ్మెస్సార్ ఈ తెల్లవారుజామున 3.45కు తుది శ్వాస విడిచారు. అయితే ఆయన కన్నుమూశారంటూ రెండు, మూడు రోజల నుంచి సోషల్ మీడియాలో వార్తలు తిరుగుతున్నాయి. ఆయన్ను చనిపోక ముందే కొన్ని టీవీ ఛానళ్లు, పత్రికలు ముందుగానే చనిపోయినట్టు రాశాయి. ఆ తర్వాత నాలిక కరుచుకున్నాయి. అయితే ఎమ్మెస్సార్ ఇవాళ కన్నుమూసింది మాత్రం వాస్తవం.