ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దారుణమైన పరిస్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో కనుమరుగైపోయిన టీడీపీ, ఇప్పుడు ఏపీలో కూడా కష్టాల్లో ఉంది. 2019 ఎన్నికల తర్వాత ఆ పార్టీకి అనేక కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. అధికారం కోల్పోవడంతో ఆ పార్టీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున వైసీపీలోకి వెళ్ళిపోయారు. అటు ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు.