మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొత్తపల్లి శామ్యూల్ జవహర్ రాజకీయాలపై సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. ``ఆయన కూడా ఫైర్ బ్రాండ్ అవ్వాలని అనుకుంటున్నారేమో.. అదేం కుదరేలా లేదు`` అంటూ సీనియర్ నేతల నుంచి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంకొందరు నాయకులు.. ``ఇలాంటి వారి వల్ల పార్టీకి ప్రయోజనం లేదు. ఇలాంటి ప్రయోగాలు అనేకం అయిపోయాయి`` అని అంటున్నారు. దీంతో ఇప్పుడు జవహర్ విషయం టీడీపీలో ఆసక్తికరంగా మారింది. సాధారణంగా పెద్ద పెద్ద విమర్శలకు దూరంగా ఉండే జవహర్.. ఇటీవల కాలంలో ఒంటికాలిపై లేస్తున్నారు.