ఏపీలో మరో ఆరు నెలల్లో మంత్రివర్గ విస్తరణ జరగడం ఖాయంగా జరిగేలా కనిపిస్తోంది. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టకపోతే చెప్పలేం గానీ, లేదంటే ఈ ఏడాది చివరికి మంత్రివర్గ విస్తరణ జరగనుంది. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకేసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాలన చేయడం మొదలుపెట్టారు. అయితే అప్పుడు మంత్రి పదవి దక్కనివారు నిరాశ పడకుండా ఓ మంచి అవకాశం కల్పించారు.