ఏపీలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన టీడీపీ, ఈ రెండేళ్లలో అసలు కోలుకోలేదు. ఇప్పటికీ వైసీపీ డామినేషన్ నడుస్తోంది. అసలు రెండేళ్ల కాలంలో చాలామంది నాయకులు పార్టీని వీడిపోయారు. మరికొందరు సైలెంట్‌గా ఉండిపోయారు. దీనికి తోడు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం టీడీపీకి దారుణమైన ఫలితాలు వచ్చాయి.