కుమురం భీమ్ జిల్లాలోని ఐదు గ్రామాల వారు కరోనాకు భలేగా కళ్లెం వేసేశారు. ఊరికో వంద మందికి కరోనా సోకినా.. భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనాను కట్టడి చేశారు. ఐదు గ్రామాల్లో ఒక్కరు కూడా ప్రాణం పోకుండా జాగ్రత్తపడ్డారు.