మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఒక ఫార్మా కంపెనీ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఎంఐడీసీ) లోని ఎంఆర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్ లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎంఆర్ ఫార్మా ప్లాంట్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి భవనం మొత్తం పొగలు అలుముకున్నాయి. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి 45 నిమిషాల పాటు కృషి చేసి మంటలను ఆర్పివేశారు.