కరోనా మొదటి వేవ్ అప్పుడు త్వరగానే లాక్ డౌన్ అమలు చేసిన సందర్భాలు చూశాం. వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, పెద్ద ఎత్తున రోడ్లను శుభ్రపరచడం వంటి నివారణ చర్యలు వేగవంతం చేశారు. కరోనా టెస్టులు సైతం భారీ సంఖ్యలో చేసి.. కరోనా రోగులను వెంటనే గుర్తించి తగిన జాగ్రత్తలతో వైరస్ వ్యాప్తి ప్రభావం తగ్గించారు.