విజయవాడ టీడీపీలో విభేదాలు తగ్గలేదా? తమ్ముళ్ళ మధ్య అంతర్గత యుద్ధం నడుస్తూనే ఉందా? అంటే ఇంకా బెజవాడ టీడీపీలో రచ్చ జరుగుతూనే ఉందని చెప్పొచ్చు. ఇక్కడ మామూలుగానే టీడీపీలో గ్రూపు రాజకీయాలు ఉంటాయి. ఇక ఆ గ్రూపులు మధ్య అంతర్గత వార్ నడుస్తూనే ఉంటుంది. అయితే ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా తమ్ముళ్ళ మధ్య పోరు బయటపడింది. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల మధ్య మాటల యుద్ధం జరిగింది.