ఏపీలో మరోసారి మంత్రివర్గ విస్తరణకు సమయం దగ్గర పడుతుండటంతో ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది. మొదటి విడతలో పదవి దక్కనివారు, ఈ రెండో విడతలో ఛాన్స్ కొట్టేయాలని చూస్తున్నారు. ఇదే సమయంలో తమ పదవులని కాపాడుకోవాలని ప్రస్తుతం కేబినెట్లో ఉన్న మంత్రులు చూస్తున్నారు. అయితే ఎలా చూసుకున్నా, పలువురికి జగన్ ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం కల్పించడం ఖాయమని తెలుస్తోంది.