ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే దేశంలో ఉన్న పలు వ్యాక్సిన్ తయారీ సంస్థలు తమ టీకా ధరను నిర్ణయించాయి. ఎక్కువ శాతం కంపెనీలు తమ వ్యాక్సిన్ ధరను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే తాజాగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను తగ్గిస్తున్నట్లు సీఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదార్ పూనావాలా తెలిపారు.