సైబర్ నేరగాళ్లు మన సమాచారం కొట్టేసేందుకు వలలు విసురుతుంటారు. అలాంటి ఓ మెస్సేజ్ ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతోంది.అది ఎలా ఉంటుందంటే.. మీకు ఓ పార్సిల్ కొరియర్లో వచ్చింది. వివరాల కోసం అంటూ ఓ లింక్ ఇస్తారు. అరే మనకు ఏం పార్సిల్ వచ్చిందబ్బా అనుకుంటూ ఆ లింక్ ఓపెన్ చేశారా అంతే సంగతులు.