స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటిన వైసీపీ తిరుపతి ఉపఎన్నికలో సత్తా చాటుతుందా? అంటే ఏ మాత్రం సందేహం లేకుండా చెప్పొచ్చు తిరుపతిలో గెలిచేది వైసీపీనే అని. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో తిరుపతిలో వైసీపీకి ఊహించని విధంగా ఓట్లు పడనున్నాయని తెలిసింది. దాదాపు 60 శాతం వరకు వైసీపీ ఓట్లు దక్కించుకున అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే టీడీపీకి 30 శాతం వరకు పడొచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.