టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా...రాజకీయాలు ఎప్పుడు అతిగానే ఉన్నట్లు కనిపిస్తాయి. ఆయన ఏం మాట్లాడినా పెద్దగా నమ్మలేనట్లుగానే ఉంటాయి. అలాగే ప్రత్యర్ధులపై ఎలాంటి విమర్శలు చేసినా, వాటిల్లో నిజం ఉన్నట్లు అనిపించదు. నాలుగుసార్లు వరుసగా గెలిచి, జగన్ వేవ్‌లో తొలిసారి ఓటమి పాలైన దగ్గర నుంచి ఉమా రాజకీయం ఇలాగే ఉన్నట్లు కనిపిస్తుంది. అసలు ఉమా మాటలు సొంత పార్టీ నేతలే పెద్దగా పట్టించుకోరనే చెప్పొచ్చు.