రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని బీజేపీ దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ మేరకు ముందుకెళుతుంది. అయితే మిగతా రాష్ట్రాల్లో బీజేపీకి కాస్త ఛాన్స్ దక్కుతున్నా, దక్షిణాదిలో పెద్దగా అవకాశం రావడం లేదు. ఏదో కర్ణాటకలో అధికారం చేజిక్కించుకున్న కమలదళం ఇప్పుడు తెలంగాణలో పాగా వేయాలని చూస్తుంది.