ఏపీకి రాజధాని ఏది ఉంటే? ఇప్పటికీ సరిగ్గా చెప్పలేని పరిస్తితి ఉంది. 2014లో రాష్ట్ర విభజన జరిగాక హైదరాబాద్ తెలంగాణకి వెళ్లిపోవడంతో, ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, అమరావతిని రాజధానిగా ప్రకటించి పాలన మొదలుపెట్టారు. అయితే చంద్రబాబు పాలన కాలంలో రాజధాని పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఇక తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్, రాజధానిగా అమరావతి పనికిరాదని చెబుతూ, మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని తెరపైకి తీసుకొచ్చారు.