కాగిత వెంకట్రావు...తెలుగుదేశం పార్టీకి వీరవిధేయుడు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి పనిచేస్తున్న నాయకుడు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కాగిత, తాజాగా అనారోగ్యంతో మరణించారు. దీంతో కృష్ణా జిల్లా టీడీపీకి పెద్ద షాక్ తగిలనట్లైంది. ముఖ్యంగా పెడన నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పొచ్చు. 2014లో పెడన ఎమ్మెల్యేగా గెలిచిన కాగిత, మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ సామాజిక సమీకరణల్లో ఆయనకు పదవి దక్కలేదు. దీంతో ఆయన పూర్తి నిరాశపడ్డారు. అయినా సరే పార్టీ మారకుండా పనిచేసుకుంటూ వచ్చారు.