తాను ఏ ఒక్కరి దగ్గర నుంచి ఎకరం భూమి కూడా లాక్కోలేదని, తన ఆస్తులు, చరిత్రపై సీఎస్, విజిలెన్స్, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకోవచ్చని మంత్రి ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. తనపై ముందస్తు ప్రణాళికతో కట్టుకథలు అల్లి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు.