కరోనాతో ఇబ్బందిపడే పాత్రికేయులకు వైద్య సేవలు అందించాలన్ని అనేక మంది జర్నలిస్టులు చేసిన విజ్ఞప్తికి ఏపీ సర్కారు స్పందించింది. కరోనా మహమ్మారి బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాత్రికేయులకు వైద్య సేవలు అందించటంలో జిల్లా వైద్య యంత్రాంగానికి, పాత్రికేయులకు మధ్య అనుసంధాన కర్తలుగా పనిచేసేందుకు సమాచార శాఖ రాష్ట్ర స్థాయిలో ఒక సీనియర్ అధికారిని, జిల్లా స్థాయిలో శాఖాధిపతులను నోడల్ అధికారులుగా నియమించింది.