కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకీ ప్రమాదంగా మారుతోంది. ఈ రోజుతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షలకు చేరింది. ఈ సంఖ్యను బట్టే ప్రస్తుత పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు అర్ధమవుతుంది. కాబట్టి మనము ఇప్పటి నుండి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన మీతో పాటు మీ కుటుంబం కూడా కరోనా బారిన పడవచ్చు.