బెజవాడ(విజయవాడ)....ఏపీలో తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలంగా ఉన్న నగరం. రాష్ట్ర విభజన జరిగాక బెజవాడపై టీడీపీకి పట్టు పెరిగింది. 2014 ఎన్నికల్లో నగరంలో మంచి ఫలితాలనే రాబట్టింది. అలాగే 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వేవ్ ఉన్నా సరే నగరంలో టీడీపీ డామినేషన్ కనిపించింది. నగరంలో ఉన్న మూడు అసెంబ్లీ సీట్లలో టీడీపీ ఒకటి గెలుచుకుంది. అలాగే విజయవాడ ఎంపీ సీటు కూడా టీడీపీ ఖాతాలోనే పడింది.