ఏపీలో టీడీపీ నేతలపై జగన్ పగ తీర్చుకుంటున్నారా? అంటే రాజకీయం తెలిసినవాళ్ళకు కాస్త అవుననే అనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ నేతల టార్గెట్గా ఎలాంటి రాజకీయం జరుగుతుందో అంతా చూస్తూనే ఉన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు తమని ఏ ఏ టీడీపీ నేతలు ఇబ్బంది పెట్టారో, వారందరినీ జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసుకుని ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది.