చిత్తూరు జిల్లా...టీడీపీ అధినాయకుడు నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా. పేరుకే బాబు సొంత జిల్లా గానీ, ఇక్కడ ఆధిక్యం మొత్తం వైసీపీదే. వైసీపీ పోటీలో దిగిన దగ్గర నుంచి జిల్లాలో టీడీపీకి మంచి ఫలితాలు రాలేదు. టీడీపీ గాలి ఉన్న 2014 ఎన్నికల్లోనే ఇక్కడ వైసీపీ హవా ఉంది. జిల్లాలో ఉన్న మొత్తం 14 అసెంబ్లీ సీట్లలో వైసీపీ 8 గెలిస్తే, టీడీపీ 6 గెలుచుకుంది. అలాగే వైసీపీ ఒక ఎంపీ, టీడీపీ ఒక ఎంపీని గెలుచుకుంది.