ఏపీలో టెన్త్ రాజకీయం జరుగుతుంది. ఎప్పుడూలేని విధంగా పదవ తరగతి పరీక్షలపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయం హాట్ హాట్‌గా నడుస్తుంది. కరోనా సమయంలో పిల్లల ప్రాణాలని దృష్టిలో పెట్టుకుని పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు టెన్త్ పరీక్షలు రద్దు చేసి, విద్యార్ధులని పాస్ చేశారని, ఏపీలో కూడా అదే చేయాలని మాట్లాడుతున్నారు.