దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న సమయంలో ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. అయితే అన్ని రాష్ట్రాల్లో కంటే పశ్చిమ బెంగాల్ లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ నెలకొంది. ఇక ఇప్పటికే దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.