తెలంగాణలో మినీ పుర పోరుగా వర్ణిస్తున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కొద్ది సేపట్లో వెలువడనున్నాయి. ఈ ఫలితాలు కరోనాపై కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపైనా.... స్థానిక సమస్యలు, రాజకీయాలపైనా ప్రజల స్పందన గా భావించొచ్చు. ఇవాళ తెలంగాణలో 2 కార్పొరేషన్లు, 5 పురపాలికలకు ఓట్ల లెక్కింపు జరగుతోంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. వీటితో పాటు సిద్దిపేట, కొత్తూరు, జడ్చర్ల అచ్చంపేట, నకిరేకల్ పురపాలికల ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభం కాబోతోంది.