రాష్ట్రంలో ఓ వైపు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుతుంటే, మరో వైపు రికవరీ రేటు కూడా అదే స్థాయిలో పెరుగుతూ కాస్త ఊరట నిస్తోంది. నిన్న ఒక్క రోజే 1,14,299 కరోనా పరీక్షలు చేయగా వాటిలో 23,920 మందికి పాజిటివ్ నిర్దారణ అయింది. ఇక ఒకే రోజు 11,411 మంది కరోనా నుండి రికవరీ అయ్యారు. ఈ విషయం నిజంగా కాస్త ఊరటను కలిగిస్తోంది.