తెలుగు దేశం నేతలను వేధించడం ద్వారా ఏపీ సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆ పార్టీనేతలు విమర్శిస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా సీఐడీ విచారణలకు పిలవడం.. టీడీపీ నేతలకు కరోనా సోకేలా ప్రవర్తించడం ద్వారా జగన్ శాడిస్టులాగా వ్యవహరిస్తున్నారని మాజీమంత్రి, దేవినేని ఉమ ఆరోపిస్తున్నారు.