చైనా నిర్లక్ష్యం మరోసారి ప్రపంచానికి పెను ముప్పుగా మారింది. ఇప్పటికే చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పుడు చైనా నిర్వాకంతో మరోసారి ప్రపంచం హడలెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. అసలేమైందంటే చైనా ఇటీవల ప్రయోగించిన 21 టన్నుల భారీ రాకెట్ లాంగ్ మార్చ్ 5బీ గతి తప్పింది.