ప్రపంచ దేశాలు, మరీ ముఖ్యంగా బ్రిటన్ వంటి దేశాలు వ్యాక్సినేషన్ విషయంలో చాలా ముందు చూపుతో ఉన్నాయి. 6.7 కోట్ల జనాభా కలిగిన బ్రిటన్ లో ఇప్పటికే మూడున్నర కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. స్కూల్ పిల్లలకి కూడా అక్కడ త్వరలో వ్యాక్సిన్ వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే క్రిస్మస్ నాటికల్లా దేశవ్యాప్తంగా మూడో డోసు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది బ్రిటన్ ప్రభుత్వం.