తెలంగాణ వ్యాప్తంగా మేనెల చివరినుంచి, లేదా జూన్ మొదటి వారం నుంచి డ్రోన్ల ద్వారా కరోనా ఔషధాల పంపిణీ చేపట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ముందుగా వికారాబాద్ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. గరిష్టంగా 30 కిలోమీటర్ల దూరంలోని గ్రామాలకు టీకాలను, ఔషధాలు పంపిణీ చేస్తారు. ఎక్కువదూరం ప్రయాణించే సామర్థ్యం గల డ్రోన్లను అద్దెకు తీసుకొని వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మొదటి దశలో 7 డ్రోన్లతో 24 రోజుల పాటు ప్రయోగాత్మకంగా రవాణా చేపడతారు. వాటి పనితీరును పరిశీలించి, సాంకేతిక సమస్యలుంటే పరిష్కరించి.. రాష్ట్రవ్యాప్తంగా దీన్ని వినియోగంలోకి తెస్తారు.