భారత్లో వచ్చే ఆగస్టు నాటికి కనీసం 10 లక్షల మంది కరోనాతో చనిపోవచ్చని ఓ అంతర్జాతీయ ఆరోగ్య పరిశోధన సంస్థ హెచ్చరించింది. వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ ఆగస్టు 1కల్లా భారత్లో 10 లక్షల మరణాలు సంభవిస్తాయని చెబుతోంది.