చైనాలోని వుహాన్ నగరం నుండి ఊడిపడ్డ ఈ కరోనా వైరస్ గత సంవత్సర కాలంగా ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ప్రజలకు ప్రశాంతత అనేది లేకుండా చేసి కలవరపెడుతోంది. ఈ కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ఇప్పటికే రెండిసివెర్ ఇంజెక్షన్, కరోనా వ్యాక్సిన్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. కానీ ఇవి పూర్తి స్థాయిలో ప్రజలందరికీ అందించడానికి భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం అంత సులభంగా జరిగే పని కాదు.