ప్రస్తుతానికి ఇద్దరు మంత్రులు ఈటల రాజేందర్‌తో టచ్‌లోకి వచ్చారని చెబుతున్నారు. ఈ సంఖ్య ఇంకాస్త పెరిగితే ఈటల రాజేందర్ కూడా దూకుడు పెంచే అవకాశం పుష్కలంగా ఉంటుంది. కేసీఆర్ సర్కారుపై.. ఆయన నాయకత్వ తీరుపై ఉన్న అసంతృప్తిని ఈటల పూర్తిగా ఉపయోగించుకోగలిగితే తెలంగాణలో రాజకీయ పోరు మరింత ఆసక్తికరంగా మారుతుందనడంతో సందేహం లేదు.