కరోనాతో అల్లాడిపోతున్న మావోయిస్ట్ లకు పోలీసులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. జనజీవన స్రవంతిలోకి వచ్చేట్లయితే వారందరికీ ప్రభుత్వం తరపున మంచి వైద్యం అందిస్తామని దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. కరోనా వైరస్ బారిన పడుతున్న మావోయిస్ట్ నాయకులు, దళ సభ్యుల గురించి తమకు సమాచారం ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ కూడా చెబుతున్నారు. వీరిలో కొందరు అగ్ర నాయకులు కూడా ఉన్నరని ఆయన తెలిపారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మావోయిస్టు నాయకులెవరైనా వైద్య సదుపాయాలు కావాలనుకుంటే పార్టీ వీడి రావాలని ఆయన సూచిస్తున్నారు.