ఏపీ రాజధాని జిల్లా గుంటూరులో ఎమ్మెల్యేలు మారినా.. కలెక్షన్లు మాత్రం మారలేదనే టాక్ వినిపిస్తోంది. ఓ పంచదార చిలక వంటి కీలక నియోజకవర్గంలో ఈ వసూళ్ల పర్వం జోరుగా సాగుతోందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న ఎమ్మెల్యే జోరుగా వసూళ్లకు పాల్పడ్డారనే విమర్శలు వచ్చాయి. సదరు ఎమ్మెల్యే గారి సతీమణి.. అన్నీ తానై.. వసూళ్లకు తెరదీశారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పురుగు మందుల కంపెనీల నుంచి ఎరువుల తయారీ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లు సాగించారు.