ఎంపీ రఘురామకృష్ణం రాజు...సీఎం జగన్ని వదిలేలా కనిపించడం లేదు. జగన్ బొమ్మతో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రాజుగారు...అదే పార్టీపై రివర్స్ అయ్యి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. స్వపక్షంలో విపక్ష నేతగా తయారయ్యి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీలో ఉంటూ ప్రతిరోజూ రచ్చబండ కార్యక్రమం పేరిట మీడియా సమావేశం పెట్టి, జగన్ని, వైసీపీ నేతలని ఏకీపారేస్తున్నారు.