సబ్బం హరి...ఏపీ రాజకీయాల్లో సుపరిచితమైన పేరు. మంచి మాటకారిగా పేరున్న సబ్బం హరి ఇటీవల కరోనాతో మరణించారు. గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న సబ్బం హరికి విశాఖ రాజకీయాలపై మంచి పట్టు ఉంది. మొదట్లో కాంగ్రెస్లో కీలకంగా పనిచేసిన సబ్బం...ఆ తర్వాత జగన్ వెంట నడిచారు. కానీ అనూహ్య పరిణామాల మధ్య జగన్కు దూరమయ్యి, 2014 ఎన్నికల్లో పరోక్షంగా టీడీపీకి సపోర్ట్ చేశారు. విశాఖలో టీడీపీకి మంచి ఫలితాలు రావడంలో సహకరించారు.