దేశ వ్యాప్తంగా కరోనా ప్రజల ఊపిరి తీస్తుంది. మొదటి వేవ్‌లో కాస్త కనికరించిన కరోనా...రెండో వేవ్‌లో ఏ మాత్రం కరుణ లేకుండా విజృంభిస్తుంది. రోజుకూ 4 లక్షల పైనే ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. వేల సంఖ్యలో మరణిస్తున్నారు. ఇక ఈ కరోనా ఏపీలో కూడా తీవ్రంగా ఉంది. ఊహించని విధంగా కరోనా కేసులు వస్తున్నాయి. దీంతో ఏపీలో ఆసుపత్రులు ఫుల్ అయిపోయాయి. అటు ఆక్సిజన్ కొరత లేదని పాలకులు చెబుతున్నా కూడా వాస్తవ పరిస్థితులు అలా లేవు.