ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తిరుపతి ఎపిసోడ్ అంటే చాలు...అందరికీ గుర్తొచ్చేది నారా లోకేష్‌పై చేసిన కామెంట్లు. ఊహించని విధంగా తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో ఓ టీడీపీ నేత పార్టీ కేడర్‌ను చంద్రబాబు, లోకేష్ వాడుకుని వదిలేస్తున్నారని.. అచ్చెన్నాయుడి ముందు గోడు వెల్లబోసుకున్నాడు. బ్రదర్ అంటూ ఒకప్పుడు మాట్లాడే లోకేష్.. ఇప్పుడు కూర్చో అమ్మా అంటూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని. పార్టీ కోసం 30 ఏళ్లు కష్టపడ్డ తనకు అన్యాయం చేశారంటూ ఆవేశపూరితంగా మాట్లాడారు.