చంద్రబాబు తాజాగా తిరువూరులో 108 సిబ్బంది కరోనా రోగి చనిపోతే.. నడిరోడ్డుపై వదిలేశారంటూ ఓ వీడియో పోస్టు చేశారు. కరోనా బాధితులను నడిరోడ్డున వదిలేసి కుయ్ కుయ్ మంటూ వెళ్లిపోతున్నాయి 108 వాహనాలు. తిరువూరులో కరోనాతో బాధపడుతున్న షేక్ సుభానీని 108 వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్తూ, మధ్యలో చనిపోతే మానవత్వం లేకుండా నడిరోడ్డు మీదే వదిలేయడం అమానుషం, అనాగరికం. ఈ ఘటనకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు? అంటూ ఓ వీడియో పోస్టు చేశారు.