ఏపీలో కరోనా సెకండ్ వేవ్ మళ్లీ విజృంభిస్తోంది. రోజూ 20 వేలకుపైగా కేసులు వస్తున్నాయి. దాదాపు 80 మంది వరకూ చనిపోతున్నారు. కరోనా కట్టడి కోసం రాష్ట్రమంతా కర్ఫ్యూ విధించారు. ఇన్ని చేస్తున్నా.. రాష్ట్రంలో ఆ పనులు మాత్రం అస్సలు ఆగడం లేదట. ఇంతకీ ఆ పనులు ఏంటో తెలుసా.. అవే పోలవరం ప్రాజెక్టు పనులు.