ఏపీలో ఎలాంటి మేటర్ అయినా సరే దానిపై రాజకీయం జరగాల్సిందే. ప్రతి అంశాన్ని రాజకీయం చేయకుండా ఏపీ నేతలు ఖాళీగా ఉండరు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఫస్ట్ వేవ్‌లో రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టిన కరోనా...సెకండ్ వేవ్‌లో సునామీలా విరుచుకుపడుతుంది. అయితే ప్రజల నిర్లక్ష్యం కావొచ్చు, ప్రభుత్వం అలసత్వం కావొచ్చు. సెకండ్ వేవ్ మరింత దారుణంగా ఉంది. రోజుకూ 20 వేల పైనే కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. అలాగే పదుల సంఖ్యలో మృతిచెందుతున్నారు.