దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు ఎటువంటి లక్షణాలూ కనిపించకుండా కూడా కరోనా సోకి అకస్మాత్తుగా మరణిస్తున్న కేసులూ నమోదు అవుతున్నాయి. లక్షణాలు కనిపించకుండా చాపకింద నీరులా కరోనా చుట్టబెట్టే కారణం ‘హ్యాపీ హైపోక్సియా’.