కేటీఆర్ ఆధ్వర్యంలో పలు ఫార్మా కంపెనీలు, ఇతర కార్పొరేట్ కంపెనీలు కరోనా యుద్ధానికి తమవంతుగా సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. మరోవైపు ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గా ఉందని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వ చర్యలను కేంద్రం కూడా గుర్తించిందని, కేంద్ర ఆరోగ్య మంత్రి కూడా అభినందించారని గుర్తు చేశారు. 60లక్షల ఇళ్లలో ఇంటింటి సర్వే పూర్తి చేశామని, 2.1 లక్షల మెడికల్ కిట్లు పంపిణీ చేశామని చెప్పారాయన. రాష్ట్రంలో 1.5లక్షల రెమిడిసివిర్ ఇంజెక్షన్లు నిల్వ ఉన్నాయని, వీటిని ఉత్పత్తి చేసే కంపెనీలతో సమన్వయం చేసుకుంటున్నామని వివరించారు.