ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఏపీ సీఎం జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనదైన శైలిలో ప్రజలకు పథకాలు అందిస్తూనే ఉన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, తాను ఇచ్చిన హామీలని వరుసపెట్టి అమలు చేస్తున్నారు. ఈ రెండేళ్లలో దాదాపు అన్నీ హామీలని అమలు చేశారు. అయితే ముందు చెప్పిన విధంగా కాకపోయినా.. పథకాలలో కొన్ని నిబంధనలు పెట్టి అమలు చేస్తున్నారు. ఇక కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా జగన్ వెనక్కి తగ్గడం లేదు.