గోరంట్ల బుచ్చయ్య చౌదరీ....తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత. దశాబ్దాల పాటు ఆ పార్టీలో రాజకీయం చేస్తున్న నాయకుడు. అయితే ఇలా సీనియర్‌గా ఉన్న బుచ్చయ్య, ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ పేరుని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. అయితే బుచ్చయ్య ఇలా జూనియర్ పేరు ఎక్కువ తలుచుకోవడానికి కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి మరీ ఘోరంగా ఉంది. ఇప్పటికే తెలంగాణలో పార్టీ కనుమరుగైపోయింది.