నెల్లూరు జిల్లా అంటే వైసీపీకి కంచుకోట అని గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పార్టీ వచ్చిన దగ్గర నుంచి నెల్లూరు జిల్లాలో మంచి విజయాలు సాధించింది. టీడీపీ గాలి ఉన్న 2014 ఎన్నికల్లో సైతం జిల్లాలో వైసీపీ వేవ్ ఉంది. మొత్తం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో 7 వైసీపీ గెలిస్తే, 3 టీడీపీ గెలుచుకుంది. ఉన్న ఒక్క ఎంపీ సీటు వైసీపీ ఖాతాలోనే పడింది. ఇక 2019 ఎన్నికల్లో అయితే చెప్పాల్సిన పని లేదు. మొత్తం వైసీపీనే క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీకి ఒక్క సీటు కూడా రాలేదు.